విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడ శంబాల టీజర్‌ను ప్రదర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల వంటి టాప్ స్టార్లు హాజరైన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో శంబాల హాట్ టాపిక్‌గా నిలవడం విశేషం.
శంభాల టీజర్‌ను సంగీత దర్శకుడు ఎస్ థమన్ లైవ్ కచేరీలో ప్లే చేశారు. ఆయన అద్భుతమైన ప్రదర్శన వేదికను అలరించింది. కార్యక్రమానికి హాజరైన అతిరథ మహరథుల నుంచి ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్ పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ మూవీని ఓ విజువల్ వండర్‌గా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండేలా నిర్మిస్తున్నారు.
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి వారు నటించారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్ కె. బంగారి అద్భుతమైన విజువల్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.