కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధ పడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది.
వాంతులవుతున్నప్పుడు కరక్కాయపొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. మలబద్దకంతో బాధపడేవారు కరక్కాయను వాడటం వలన విరోచనం సాఫీగా అవుతుంది. ఇది వాతాన్ని హరిస్తుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారు కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి, కళ్లమంటలు తగ్గుతాయి.