సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సబ్జా గింజలు కనిపిస్తుంటాయి. అలాగే, శీతలపానీయాల్లో కూడా సబ్జా గింజలను వేసుకుని సేవిస్తుంటారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఈ సబ్జా గింజలు డీహైడ్రేషన్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తాయి.
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు, ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడటంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ఇ లభించడంతో బాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక వేసవిలో దాహార్తితో పాటు.. శరీర బరువుని కూడా తగ్గించే సబ్జాలను తాగండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.