మహిళలూ.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే..?

FILE
మహిళలు సరైన సమయానికి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మగువలు సమయానికి సరైన ఆహారం తీసుకోవాలని వారు అంటున్నారు. అప్పుడే ఎలాంటి జబ్బులు దరిచేరవు.

ఉద్యోగాలకు వెళ్లే మహిళలు పని ఒత్తిడి, హడావుడిలో ఉదయం పూట అల్పాహారం తీసుకోరు. కొందరు రాత్రి 8 నుండి 9 గంటల మధ్య భోజనం చేసి పడుకుంటారు. ఇక ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ అస్సలు తీసుకోరు. ఆఫీసుకు వెళ్లిపోయి ఉదయం పది నుండి పదకొండు గంటలమధ్య తింటారు. అంటే రోజులో సగం సేపు రాత్రి 9 గంటల నుండి ఉదయం 9 గంటల వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా గడిపేస్తారు. తర్వాత మిగిలిన సగం రోజులోనే మొత్తం ఆహారాన్ని తీసుకుంటారు.

ఇలా చేయడం వల్ల దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై పడుతుందని, ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూట నిరాహారంగా ఉండడం వల్ల మన శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తి అందదు. దీనికితోడు మనం చేస్తున్న పనిలో మానసికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుచేత సరైన టైమ్‌కి ఆహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి