మహిళల అకాల మరణాలను అరికట్టవచ్చు...

మహిళలు వయసు మీరక ముందే మరణించడాన్ని కొన్ని పద్దతులు పాటించడం ద్వారా అరి కట్టవచ్చని కొత్త సర్వే తెలిపింది. సిగరెట్లు మానడం, రోజూ వ్యాయామం చేయడం, తాము తీసుకుంటున్న ఆహారం మరియు ఆల్కహాల్‌ను అప్పుడప్పుడూ తనిఖీ చేసుకోవడం వంటి చర్యలు మహిళల అకాల మరణాలను అడ్డుకుంటున్నాయని ఈ సర్వే చెప్పింది.

బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఈ అధ్యయనాన్ని ఆన్‌లైన్‌లో ప్రచురించింది. హార్వార్డ్ స్కూల్‌ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ బ్రిగ్‌హామ్ ఉమన్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాబ్ వాన్ డామ్ మరియు అతడి బృందం 1980లో 34 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన 80 వేలమంది మహిళల ఆరోగ్యాన్ని సమీక్షించారు.

ఈ 24 ఏళ్ల కాలంలో 15 లక్షల మంది ఆరోగ్యాలకు సంబంధించిన డేటాను ఈ పరిశోధక బృందం విశ్లేషించింది. ప్రతి రెండేళ్లకోసారి వీరి ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఆల్కహాల్ సేవనం, బరువు, ధూమపానం మరియు వ్యాధి చరిత్రలను వీరు విశ్లేషించారు. వీరిలో మరణించినవారి వివరాలను వారి సమీప బంధువులు మరియు జాతీయ మరణాల సూచి తెలిపాయి.

ఈ కాలం పొడవునా 8882 మంది మహిళలు మరణించగా వీరిలో 1790 మంది గుండెపోటుతోనూ, 4527మంది కేన్సర్‌తోనూ మరణించారు. మహిళలు ధూమపానం చేయనట్లయితే వీరిలో 28 శాతం మరణాలను అరికట్టవచ్చని, ఎన్నడూ పొగ తాగకుండా ఉండినట్లయితే 55 శాతం మంది మహిళలు బతికి ఉండేవారని ఈ బృందం పేర్కొంది.

శారీకర వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన బరువును కొనసాగించినట్లయితే ఈ మహిళ్లో మరణాలు మరింత తగ్గి ఉండేవని ఈ పరిశోధన తేల్చింది. ఆల్కహాల్ సాధారణంగా తీసుకుంటే అది మహిళల మరణాలపై ప్రభావం చూపలేదని, అయితే మితి మీరి తాగినప్పుడు కేన్సర్‌తో చాలామంది మహిళలు చనిపోయారని పేర్కొన్నారు.

అన్నిటికంటే మించి ధూమపానం అనేది మహిళల అకాలమరణానికి ప్రధాన హేతువుగా కనిపించిందిన ఈ అధ్యయనం పేర్కొంది. జీవన శైలిలో కాస్తంత మార్పు చేపట్టిన సందర్భాల్లో మహిళల మరణాల రేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఈ సర్వే చెప్పడం విశేషం.

కాబట్టి జీవితమూ మన చేతుల్లోనే ఉంది అకాల మరణమూ మన చేతుల్లోనే ఉంది.

వెబ్దునియా పై చదవండి