సౌందర్యమైన చర్మం కోసం ఇవి తీసుకోండి.!

FILE
సౌందర్యమైన నిగనిగలాడే చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. సమతులాహారంలో కీలకపాత్ర వహించే పండ్లు, కూరగాయల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. చర్మ సౌందర్యం ఇనుమడించాలంటే కొన్నిరకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. 'సి' విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కొత్త కాంతులీనుతుంది.

వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా అవుతుంది. వార్ధక్యపు ఛాయలు కనిపిస్తాయి. ఈ సమస్యకు పాలకూరలోని విటమిన్‌ 'ఇ', క్యారెట్‌లోని విటమిన్‌ 'ఏ' తో పాటు యాంటీ ఆక్సీడెంట్లు చక్కని పరిష్కారం అందుకే వీటిని తరచూ తీసుకోవాలి.

ఫోలిక్‌యాసిడ్‌, జింక్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వాడి రక్తప్రసరణ చురుగ్గాసాగేలా చేస్తాయి. దేహంలోని మలినాలను తొలిగించడంలో కీరదోస పాత్ర కీలకం. విటమిన్‌ 'సి' తోపాటు ఇనుము సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం తేటగా తయారౌతుంది

వెబ్దునియా పై చదవండి