ఫ్యాటియాసిడ్ అందాలంటే.. పాలు తాగిన తర్వాత పండ్లు తీసుకోవచ్చా?

సోమవారం, 5 అక్టోబరు 2015 (16:54 IST)
గర్భం దాల్చిన మహిళలకు ఫ్యాటియాసిడ్స్ అందాలంటే.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే అనుమానం ఉంటుంది. ఆ అనుమానం మీలో ఉంటే.. ఈ కథనం చదవండి. గర్భస్థ శిశువు కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే.. విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలతో కూడిన సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
 
అందుకే గర్భిణులు ఇతర పోషకాలతో పాటు డి.హెచ్‌.ఎ. (డొకొసా హెక్సానిక్‌ యాసిడ్‌) అనే ఫ్యాటీయాసిడ్‌ పుష్కలంగా అందేలా చూసుకోవాలి. అంతేకాదు ఏడాది దాటిన పిల్లలకు కూడా ఈ ఫ్యాటీయాసిడ్‌ సమృద్ధిగా అందివ్వాలి. కోడిగుడ్లు, బాదం లాంటి ఎండు గింజల్లోని పప్పులు, సోయా, అవిస గింజలు, చేపలు, చేప నూనెలు, వెజిటబుల్‌ నూనెలు తదితరాల ద్వారా ఈ ఫ్యాటియాసిడ్‌ విరివిగా లభిస్తుంది.
 
అలాగే పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకుంటారు. కానీ పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకోకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాగే బ్రెడ్‌తో పాటు పాలు తీసుకోవడం, పాలు ఉప్పుతో కలిపి తీసుకోవడం చేయకూడదు. పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా ఇత్తడి పాత్రలో ఉండిన  నెయ్యిని వాడకూడదు. చల్లని, వేడి పదార్థాలు వెంట వెంటనే తీసుకోరాదు. 
 
వేడివేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు. మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు తీసుకోవడం, పెరుగుతో చికెన్ తీసుకోవడం, చేపలతో చెక్కర, దోస, టమోటాలను నిమ్మతో తీసుకోవడం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి