ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు

ఠాగూర్

సోమవారం, 21 జులై 2025 (19:05 IST)
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తేదీన నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఏ రాష్ట్రాలకు ఎంత భారం అనే అంశంపై చర్చించారు. ఉచిత ప్రయాణంతో లబ్ది, 100 శాతం రాయితీ వివరాలను మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టిక్కెట్‌లో పొందుపర్చాలన్నారు. 
 
"ఈ పథకం ఆర్టీసీ భారంకాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి. నిర్వహణ వ్యయం తగ్గింపుతో సంస్థను లాభాల బాట పట్టించాలి. లాభాల అర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులో కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గిస్తుంది. ఇందుకోసం అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. అన్ని ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లపై ఏర్పాటుపై అధ్యయనం చేయాలి" అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 
 
చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే 
 
ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా, చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు డబుల్ ఫైన్ విధించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ ప్రతిపాదన చేసింది. 
 
అంతేకాకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదా ఉల్లంఘన ఆధారంగా డ్రైవర్లకు మెరిట్ అండ్ డీమెరిట్ పాయింట్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. మోటర్ వాహనాల చట్టం సవరణల్లో భాగంగా, ప్రతిపాదించిన ఈ మార్పులపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోడ్డు రవాణా శాఖ కోరినట్టు సమాచారం. 
 
వాహనాల్లో చిన్నపిల్లలను తీసుకెళ్లే అనేక మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు