మహిళల్లో పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిచ్చే చేపలు.. (video)

సోమవారం, 22 మార్చి 2021 (23:20 IST)
చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కాలంలో వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపల్లో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వున్నాయి. పిల్లలకు ఇవి పిల్లల మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఇవి మహిళల్లోని గర్భసంచికి బలాన్నిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. 
 
ప్రోస్టేట్ క్యాన్సర్లను నయం చేస్తాయి. ఇందులోని క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులు ఎముకలకు బలాన్నిస్తాయి. వాటి వృద్ధికి తోడ్పడుతాయి. మహిళలు గర్భకాలంలో చేపలను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఎముకలకు బలాన్నిస్తాయి. పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిస్తాయి. చేపలను తీసుకునే పిల్లల్లో ఆస్తమా వ్యాధి దరిచేరదు. మానసిక ఒత్తిడి వుండదు. చర్మవ్యాధులు వుండవు. నిద్రలేమికి చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు