క్యాలీఫ్లవర్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలంటే?

బుధవారం, 3 మార్చి 2021 (20:07 IST)
cauliflower
క్యాలీఫ్లవర్‌ను మహిళలు నెలకు మూడుసార్లైనా తీసుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. క్యాలీఫ్లవర్‌లోని పీచు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళలు కానీ పురుషులు కానీ క్యాలీఫ్లవర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధించవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యంగా వుంటుంది. అలాగే రక్త నాళాల్లో ఏర్పడిన కొవ్వును నియంత్రిస్తుంది.
 
క్యాలీఫ్లవర్‌లోని కోలన్ అనే ధాతువులు మెదడుకు మేలు చేస్తుంది. ఇందులోని డి విటమిన్ శరీరంలోని ఎముకలకు బలాన్నిస్తుంది. ఇంకా క్యాలీఫ్లవర్‌లోని ఫ్యూరిన్ అనే ధాతువులు మోకాళ్ల నొప్పులను, వాపుకు చెక్ పెడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు.. క్యాలీఫ్లవర్‌ను వారానికి మూడుసార్లు తీసుకోవాలి. క్యాలీఫ్లవర్‌ కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు