బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.