నెలసరి పొత్తికడుపు నొప్పికి అరటితో చెక్ పెట్టండి!

శుక్రవారం, 14 నవంబరు 2014 (16:33 IST)
నెలసరి ముందు వచ్చే పొత్తికడుపు నొప్పి, గర్భిణుల్లో కనిపించే బలహీనత, తీవ్రమైన అలసట, నలభైల్లో ఏర్పడే కీళ్లనొప్పులను దూం చేసుకోవాలంటే రోజుకో అరటిపండు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బి6 లోపంతో ఏర్పడే ఈ రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. అరటిపండుతో పాటు మాంసం, పొట్టుధాన్యాలు, కూరగాయలు, నట్స్, చికెన్, గుడ్లు, చిక్కుడు జాతి గింజలు, బంగాళాదుంపలను డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇవి రక్తంలో హిమోగ్లోబిన్‌ పెంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. 
 
మెనోపాజ్ దశ తరవాత మహిళలకూ పురుషులతో సమానంగా గుండెజబ్బులు ఎదురవుతాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచేందుకు అరటితో పాటు పైన చెప్పిన వాటిని మెనూలో చేర్చుకోవాలి.

వెబ్దునియా పై చదవండి