పీచ్ పళ్ళను గర్భిణీ స్త్రీలు తినవచ్చా? తినకూడదా?

సోమవారం, 9 మార్చి 2015 (16:17 IST)
పీచ్ పళ్ళలో ఇనుప ఖనిజం పాలు అధికంగా వుంటుంది. పైగా, ఇందులో మాంసకృత్తులు, చక్కర, జింక్, పెక్టిన్ లాంటివి పుష్కలంగా వుంటాయి. అయితే పీచ్ పండు కూడా వేడి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం వుంది. పైగా ఈ పండులో వుండే పీచు పదార్ధం గొంతుకు ఇబ్బంది కలిగిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలకూ అలర్జీ, గొంతు నొప్పి కలుగవచ్చు. అందువల్ల వారు ఈ పండును ఎక్కువగా తినకూడదు. ఒకటి రెండు తిన్నాపై తోలు వలిచి పీచు అడ్డు పడకుండా చూసుకోవాలి.
 
సీతాఫలం చాలా తీయగా సుగంధ భరితంగా వుంటుంది. తగిన మోతాదులో తీయగా వుండే ఈ పండు తినేటప్పుడు జిగురుగా అనిపించదు. అందువల్ల చాలామంది, ముఖ్యంగా స్త్రీలు ఇది తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ తీపి రుచి గుండ్రని ఆకారం ఇది తినే వారి శరీరాన్ని వేడిగా తయారుచేస్తుంది. అందువల్ల సీతాఫలం ఎక్కువగా తినే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి