వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..
వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం తీసుకోవాలి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. తద్వారా గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరమవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్‌కు కూడా నిమ్మరసం పనికొస్తుంది.
గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్‌ను వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. అలాగే నిమ్మరసం గర్భిణీ మహిళల్లో అజీర్తికి చెక్ పెడుతుంది. పాదాల వాపును నియంత్రిస్తుంది. అలాగే వేసవిలో మహిళలు అధిక బరువును మోయకూడదు. తగిన విశ్రాంతి తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్ఠికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.