కొలెస్ట్రాల్ తగ్గాలంటే కీరదోస తీసుకోవాల్సిందే

శనివారం, 3 ఏప్రియల్ 2021 (23:32 IST)
శరీరంలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు కీరదోసను తింటే సమస్యలు తగ్గుముఖం పడతాయి. కీరదోసకాయలను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.
 
అధిక బరువు ఉన్న నిత్యం కీరదోస తింటే బరువు తగ్గుతారని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. వేసవిలో పలు వేడి చేసే పదార్థాలను తినడం వల్ల కొందరికి విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారు ఆ పదార్థాలను తిన్నప్పుడు కీరదోస తింటే శరీరం వేడి కాకుండా ఉంటుంది. దీంతో విరేచనాలు రాకుండా ముందస్తుగా నిరోధించవచ్చు.
 
కీరదోసను అడ్డంగా చక్రాల మాదిరిగా కట్ చేసి కళ్లపై కాసేపు (20 నిమిషాలు) ఉంచుకుంటే కళ్లకు మేలు కలుగుతుంది. ఎండకు వెళ్లి వచ్చే వారు కళ్లపై కీరదోస ముక్కలను ఉంచుకుంటే కళ్లపై ఒత్తడి పడకుండా చూసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు