వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుకుంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది. అలాగే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది. కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్థ్రైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది.
ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు చికిత్స కోసం కీరదోసకాయ మేలు చేస్తుంది. కీరదోసను గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశమనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది.