నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే అలసట, తలనొప్పి తప్పదట. గంటకోసారి గ్లాసు నీళ్లు తాగితే నీరసం, అలసట దరిచేరదు. ఆదివారం వచ్చిందంటే... చాలా మంది మహిళలు ఇంటిని సర్దుకునే పనిలో మునిగిపోతుంటారు. అలా చేయకుండా కాసేపు నడుం వాల్చండి. లేకుంటే ఉద్యోగం చేసే మహిళలకు కష్టమే. వారానికి ఓ సారైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటేనే వారానికి రీచార్జిలా పనిచేస్తుంది.
రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది. టొమాటోలు తినడం కూడా చాలా మంచిది. ఎర్ర ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచివి. చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అందులో ఉండే మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ ఆరోగ్యానికి, మీచర్మ సంరక్షణకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.