వారానికి రెండుసార్లు చేపలు తినండి.. అడినోమాకు చెక్ పెట్టండి!

బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (13:19 IST)
FILE
మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని కొత్త అధ్యయనంలో తేలింది. వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకదని బోస్టన్‌లోని హర్వాద్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ గియోవానుసికీ తెలిపారు.

అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు. ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఇంకా వారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఎడ్వర్డ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి