కరోనా ఎఫెక్ట్: కోట్ల మంది మహిళలకు గర్భనిరోధక సాధనాల కొరత, పెరిగిపోతున్న అవాంఛిత గర్భాలు

సోమవారం, 25 మే 2020 (13:29 IST)
కోవిడ్-19 వలన ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాల కొరత ఏర్పడ వచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. గర్భ నిరోధక సాధనాలు, మందుల కొరత ఏర్పడితే ఫిలిప్పీన్స్‌లో అవాంఛిత గర్భాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

 
కోవిడ్-19 కారణంగా కొన్ని కోట్ల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు, మందులు లభించకపోవచ్చని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) హెచ్చరించింది. ప్రపంచంలో అత్యల్ప ఆదాయం ఉన్న 114 దేశాలలో 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చని యూఎన్ఎఫ్‌పీఏ పేర్కొంది.

 
లాక్ డౌన్ మరో 6 నెలల పాటు కొనసాగితే 70 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భాలు దాల్చే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది. లాక్ డౌన్ పొడిగిస్తున్న ప్రతి మూడు నెలలకి మరో 20 లక్షల మంది మహిళలకి ఆధునిక గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చు. గర్భ విచ్చిన్నం చేయించుకోవడం నేరంగా పరిగణించే ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఇది మరింత సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. ఈ దేశాల్లో గర్భ నిరోధక సాధనాల కోసం ప్రజలు సామాజిక ఆరోగ్య కేంద్రాల మీద ఆధార పడతారు.

 
ఒక్క ఫిలిప్పీన్స్ దేశంలోనే కోవిడ్-19 వలన అవాంఛిత గర్భాలు దాల్చిన వారిలో కనీసం 22 లక్షల మంది మహిళలు ఉండి ఉండవచ్చని, ఫిలిప్పీన్స్‌లో యూఎన్ ప్రతినిధి డాక్టర్ జోసెఫ్ మైకేల్ సింగ్ చెప్పారు. ఇది గర్భ నిరోధక సాధనాల లభ్యతలో 50 శాతం కొరత ఉన్నప్పుడు అంచనా వేసిన పరిస్థితి అని చెప్పారు.

 
నర్సులు, ఆయాలు, అత్యవసర విభాగాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో అవాంఛిత గర్భాలు పెరిగితే అవి మరిన్ని ప్రసూతి మరణాలకు దారి తీయవచ్చని యూఎన్ఎఫ్‌పీఏ హెచ్చరించింది. కండోమ్‌లు, హార్మోనల్ ఇంప్లాంట్లు, ప్రొజెస్టెరాన్ మందుల నిల్వల్లో కొరత ఏర్పడినట్లు రూట్స్ ఆఫ్ హెల్త్ అనే స్వచ్చంద సంస్థ అధికారి అమీనా ఇవాంజెలిస్ఠా స్వేన్పొయెల్ చెప్పారు.

 
ఈ సంస్థ ఫిలిప్పీన్స్‌లో పుయెర్టో ప్రిన్సెస్, మారుమూల ప్రాంతాలైన పాలవాన్ లలో ఉచిత పునరుత్పత్తి వైద్య సేవలు అందిస్తుంది. కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా సేవలు ఆగిపోవడంతో మందుల నిల్వలు తగ్గుతున్నాయి. అయితే, తమ దగ్గర తగినన్ని గర్భ నిరోధక మందుల నిల్వలు ఉన్నాయని, కాకపొతే వాటిని అందరికీ పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వ జాతీయ కుటుంబ సంక్షేమ పధకం అధికారులు చెప్పారు.

 
"మా దగ్గరకి ఒక మహిళ మందుల కోసం 10 కిలోమీటర్లు నడుస్తూ వచ్చారు. అయితే దారిలో చాలా చెక్ పాయింట్ల దగ్గర ఆగి ఆమె ఎక్కడికి వెళుతుందో వివరణ ఇవ్వవలసి వచ్చింది’’ అని పుయెర్టో ప్రిన్సెస్ ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న అనలిజా హెరెరా చెప్పారు. ఫిలిప్పీన్స్ దేశంలో లాక్ డౌన్ సమయంలో బయటకి రావడానికి ప్రతి ఇంటికి ఒకరికి మాత్రమే క్వారంటైన్ పాస్ ఇచ్చారు. ఈ పాస్ ముఖ్యంగా చాలా ఇళ్లల్లో పురుషులకి మాత్రమే లభించిందని స్వేన్పొయెల్ చెప్పారు.

 
ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకి బయటకి వెళ్లి గర్భ నిరోధక సాధనాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా తాము గర్భ నిరోధక పద్ధతులు అవలంబిస్తున్నట్లు వారి భాగస్వాములకు తెలియని పక్షంలో అది వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. పాలవాన్‌లో లాక్ డౌన్‌ని ఇప్పుడిప్పుడే సడలిస్తుండటంతో ప్రజా రవాణా సౌకర్యాలు మొదలయ్యాయి.

 
"మాకు చాలా మంది మహిళల దగ్గర నుంచి గర్భ నిరోధక మందులు కావాలని సందేశాలు వస్తున్నాయి. కానీ, వారు ఆరోగ్య కేంద్రానికి రావడానికి భయపడుతున్నారు’’ అని స్వేన్పొయెల్ చెప్పారు. అలాగే, క్వారంటైన్లో భాగస్వామితో కలిసి ఉండటం కూడా ఒక సవాలుగా మారుతోందని అన్నారు. “సహజ గర్భ నిరోధక విధానాలు పాటించే మహిళలకి ఇది మరింత ఇబ్బంది. ముఖ్యంగా పునరుత్పత్తి సమయంలో బ్రహ్మచర్యం పాటించటం కష్టమని” అన్నారు.

 
"మా దగ్గరకి ఒక మహిళ మందుల కోసం 10 కిలోమీటర్లు నడుస్తూ వచ్చారు. అయితే దారిలో చాలా చెక్ పాయింట్ల దగ్గర ఆగి ఆమె ఎక్కడికి వెళుతుందో వివరణ ఇవ్వవలసి వచ్చింది’’ అని పుయెర్టో ప్రిన్సెస్ ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న అనలిజా హెరెరా చెప్పారు. ఫిలిప్పీన్స్ దేశంలో లాక్ డౌన్ సమయంలో బయటకి రావడానికి ప్రతి ఇంటికి ఒకరికి మాత్రమే క్వారంటైన్ పాస్ ఇచ్చారు.

 
ఈ పాస్ ముఖ్యంగా చాలా ఇళ్లల్లో పురుషులకి మాత్రమే లభించిందని స్వేన్పొయెల్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకి బయటకి వెళ్లి గర్భ నిరోధక సాధనాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా తాము గర్భ నిరోధక పద్ధతులు అవలంబిస్తున్నట్లు వారి భాగస్వాములకు తెలియని పక్షంలో అది వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది.

 
పాలవాన్ లో లాక్ డౌన్ ని ఇప్పుడిప్పుడే సడలిస్తుండటంతో ప్రజా రవాణా సౌకర్యాలు మొదలయ్యాయి. "మాకు చాలా మంది మహిళల దగ్గర నుంచి గర్భ నిరోధక మందులు కావాలని సందేశాలు వస్తున్నాయి. కానీ, వారు ఆరోగ్య కేంద్రానికి రావడానికి భయపడుతున్నారు’’ అని స్వేన్పొయెల్ చెప్పారు. అలాగే, క్వారంటైన్లో భాగస్వామితో కలిసి ఉండటం కూడా ఒక సవాలుగా మారుతోందని అన్నారు.

 
“సహజ గర్భ నిరోధక విధానాలు పాటించే మహిళలకి ఇది మరింత ఇబ్బంది. ముఖ్యంగా పునరుత్పత్తి సమయంలో బ్రహ్మచర్యం పాటించటం కష్టమని” అన్నారు. రూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి ఉచితంగా గర్భ నిరోధక మందులు సరఫరా చేస్తోంది. "ఇలాంటి పనులు చేస్తూ నేను ఇన్ఫెక్షన్ బారిన పడతానేమో అని చాలా భయపడేదానిని’’ అని షెరీ విల్లగారాసియా అనే నర్స్ చెప్పారు. ఆమె ఆరు నెలల బిడ్డకి తల్లి.

 
"మేము చూసిన చాలా మంది మహిళలు గర్భ నిరోధక సాధనాలు కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరు". ఫిలిప్పీన్స్‌లో విధించిన లాక్ డౌన్ వలన పునరుత్పత్తికి సంబందించిన వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. "నేను చూసిన ఒకామె ఇంట్లో కాకుండా బయటకి వచ్చి ఇంజక్షన్ చేయించుకున్నారు. ఎందుకంటే ఆమె గర్భ నిరోధక సాధనాలు వాడుతున్నట్లు ఆమె భర్తకి తెలియదు. గృహ హింస ఉన్న ఛాయలు కన్పించాయి’’ అని షెరి చెప్పారు.

 
పాలవాన్ ప్రాంతంలో యుక్త వదదదదయస్సులో గర్భం దాల్చే వారి సంఖ్య ఎక్కువగా నమోదు అయింది. ఈ విపత్తుకి ముందు కూడా ఫిలిప్పీన్స్ లో మహిళలకి గర్భ నిరోధక సాధనాలు లభించడం కష్టతరంగా ఉండేది. “నాకు తెలిసిన ఒక టీనేజ్ తల్లి తన బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం ద్వారా మళ్ళీ గర్భం రాకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. అయితే, గర్భం దాల్చకుండా అడ్డుకోవడానికి ఇది సరైన పద్దతి కాదు” అని షెరి చెప్పారు.

 
2017లో నిర్వహించిన ఒక జాతీయ సర్వేలో 49 శాతం మంది అవివాహిత మహిళలు గర్భ నిరోధక సాధనాలు వాడటం లేదని తెలిసింది. 17 శాతం మంది వివాహితులు కూడా ఎటువంటి సాధనాలు వాడటం లేదు. గర్భ నిరోధక సాధనాలు వాడటం వలన ప్రతికూల ప్రభావాలు ఉంటాయనే భయంతో సగం మంది వీటికి దూరంగా ఉంటున్నారని డాక్టర్ జోసెఫ్ చెప్పారు.

 
ఇక్కడ అధికంగా క్యాథలిక్ మతస్థులు ఉంటారు. దీంతో సాంప్రదాయ మత గురువుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భ నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలని ప్రభావితం చేసే ముస్లిం నాయకుల ప్రభావం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. అవాంఛిత గర్భాలు దాల్చడం వలన మహిళల పై ఆర్ధిక, సామాజిక, మానసిక ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా అవాంఛిత గర్భాల వలన ఒక మహిళ ఆర్ధిక పరిస్థితి కూడా మారిపోవచ్చని షెరి అన్నారు. "ఇది విచారించదగిన విషయం. మహిళలకి గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండాలి."

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు