ఆస్ట్రాజెనెకాకు బ్రేక్.. సైడ్ ఎఫెక్ట్స్ వల్లే పూర్తిగా ఆపేశారు..

గురువారం, 15 ఏప్రియల్ 2021 (11:27 IST)
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వినియోగాన్ని యూరోపియన్ దేశం డెన్మార్క్ పూర్తిగా నిలిపేసింది. దీంతో ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సైడ్ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఆ దేశం చెప్పింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లేకుండానే డెన్మార్క్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ వెల్లడించారు.
 
ఆస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యురోపియన్ డ్రగ్ కంట్రోలర్ చెప్పినా కూడా డెన్మార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండటం, వ్యాక్సిన్‌కు మధ్య క్రాస్ రియాక్షన్ ఉన్నట్లు బ్రోస్ట్రోమ్ చెప్పారు. డెన్మార్క్‌లో ఇప్పటికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న అందరికీ వ్యాక్సిన్లు వేశామని, కరోనా నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు