ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపది ముర్ము: వైఎస్ జగన్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ

మంగళవారం, 12 జులై 2022 (18:24 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్మును గెలిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సామాజిక న్యాయంవైపు నిలబడిన ప్రభుత్వం తమదని, చేతల్లోనే ఆ విషయాన్ని చూపించామని, మరో అడుగు ముందుకేస్తూ ద్రౌపది ముర్మును ఎన్నుకుంటామని తెలిపారు.

 
ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికలో ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు వేసేలా పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఆమె ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.

 
ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ రెడ్డిలు తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ద్రౌపది ముర్ము పర్యటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు