వేసవిలో మీ చేతుల సౌందర్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. చక్కని ఆకృతికి తోడు చేతులు కూడా మృదువుగా ఉంటే మరింత అందం చేకూరుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బంగాళాదుంప ఉడికించిన నీటిలో (చల్లారిన తర్వాత) ఒక గంటసేపు చేతులను ఉంచండి.
మీ చేతులకు రాత్రి పడుకునేముందు పెరుగు, గ్లిసరిన్ కలిపిన మిశ్రమాన్ని రాసుకుని పడుకోండి. డిటర్జెంట్ సోప్స్ వాడినవెంటనే నిమ్మరసంలో పెరుగుచేర్చి శుభ్రపరుచుకుంటే చేతులు ఎంతో మృదువుగా ఉంటాయి. వీలైనంతవరకు శాండిల్‌సోప్స్ వాడితేనే మంచిది. గోళ్ళుకూడా ఎప్పటికప్పుడు అందంగా కట్ చేసుకుని పాలిష్ చేసుకుంటే బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.