దేవతలకు సమర్పించిన ఎండిపోయిన పువ్వులు.. పారేస్తున్నారా? (video)

శనివారం, 11 మార్చి 2023 (13:40 IST)
Face pack with Dried Flowers
దేవతలకు సమర్పించిన పువ్వులను తిరుమల దేవస్థానం అగరవత్తులుగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా గాకుండా దేవతలకు సమర్పించిన ఎండిన తులసి, మందార, రోజా పువ్వులను పారేస్తున్నారా.. అయితే ఎండిన పువ్వులను పారేయకుండా వాటిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు. 
 
ఎలాగంటే.. ఎండిపోయిన పువ్వులు అంటే రోజా పువ్వులు, తులసి ఆకులు, మందార పువ్వులను పారేయకుండా అలానే ఓ పాత్రలోకి తీసుకుని లేత సూర్య కిరణాల పడే చోట అరగంట వుంచాలి. 
 
ఆ తర్వాత నీడలోనే వాటిని ఎండనివ్వాలి. అలా రెండు రోజుల పాటు ఎండిన తర్వాత వాటిని తీసుకుని పౌడర్‌లా సిద్ధం చేసుకోవాలి. ఆ పువ్వులను బాగా మిక్సీలో పొడిగా పట్టించుకోవాలి. 
 
ఆ పౌడర్‌ను తీసుకుని అందులో కాస్త పసుపు పొడి, పనీర్, తేనె కలిపి వారానికి రెండు సార్లు ప్యాకులా వేసుకుంటే చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఈ మిశ్రమానికి పెరుగును కూడా జోడించుకోవచ్చు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు