ఎండిపోయిన పువ్వులను పారేస్తున్నారా..?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:12 IST)
ప్రతి రోజూ పెసర పిండిలో కాస్త గోధుమ పిండిని కలిపి ముఖానికి, చేతులకు, మెడకు రాసుకుని స్నానం చేస్తే చర్మంపై గల నల్లమచ్చలు తొలగిపోతాయి. అలానే బజారులో దొరికే కర్పూర నూనెను ముఖానికి రాసుకుని కాసేపాగి కడిగేస్తే కూడా మచ్చలు పోతాయి.
 
కంటి చుట్టూ నల్లని వలయాలు:
గంధం తీసే చెక్కపై జాజికాయను రుద్ది ఆ వచ్చిన రసాన్ని కంటి చుట్టూ రాత్రి సమయంలో రాసి పడుకోండి. ఉదయాన్ని చల్లని నీటితో కడగండి. జాజికాయ, గంధపు చెక్కలో ఉన్న చల్లదనం మీ కంటికి చల్లదన్నానిచ్చి నల్లటి వలయాలను తొలగిస్తుంది.
 
పువ్వులతో ఫేస్ పౌడర్:
దేవుని పూజకు ఉపయోగించిన పూలను ఎండిపోయాక పరేయకండి. వాటిని ఎండలో పెట్టి ఫేస్ పౌడర్‌గా ఉపయోగించకోవచ్చు. వీటితో పాటు కాస్త పసుపును కలిపి పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఇందులో కాస్త రోజ్‌వాటర్ లేదా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాయండి. ఆరాక చల్లని నీటితో కడిగేయండి. ముఖం కాంతివంతమవడమే కాకుండా, చర్మం మృదువుగా తయారవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు