పాలు, కలబంద గుజ్జుతో చర్మం మృదువుగా.. ఎలా?

శనివారం, 3 నవంబరు 2018 (13:30 IST)
ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు. మరి వాటిని వాడితో కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ క్రీములు వాడడానికి బదులుగా ఇంట్లోని పదార్థాలు ఉపయోగించే మెుటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది. అవేంటో పరిశీలిద్దాం..
 
వంటసోడా ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాబట్టి.. వంటసోడాతో ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం.. వంటసోడాలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారాంలో రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లని నల్లని మచ్చలు వస్తుంటాయి. వాటిని ఎలా తొలగించాలంటే.. క్యారెట్‌‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
కొందరికి వయసు తేడా లేకుండా ముఖం ముడతలుగా మారిపోతుంది. అలాంటప్పుడు.. పాలలో కొద్దిగా కలబంద గుజ్జు, కాకరకాయ రసం, పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముడతల చర్మం తొలగిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు