కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి..?

శనివారం, 12 జనవరి 2019 (11:58 IST)
చలికాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కొబ్బరి నూనెను అప్లై చేస్తే చర్మం ఒరిజినల్ కలర్‌ను సంతరించుకుంటుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా టమోటో రసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుంటే.. చర్మం మృదువుగా తయారవుతుంది. పెదాల పగుళ్ళు, డ్రై లిప్‌ను నివారించడానికి కొబ్బరినూనె గ్రేట్‌గా సహాయపడుతుంది. లిప్ బామ్‌కు బదులుగా కొబ్బరి నూనెను అప్లై చేసి ఫలితాన్ని మీరే గమనించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.
 
పాదాల పగుళ్లకు కొబ్బరినూనెతో చెక్ పెట్టవచ్చు. పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతిరోజూ రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళు నివారించి చర్మం మృదువుగా తయారవుతుంది. అలానే చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తే సరిపోతుంది. కొన్ని చుక్కల నూనెను స్నానం చేసే నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కొ బ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖానికి వేసుకుంటే పొడిబారిన చర్మం కాస్త తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు