చలికాలంలో నువ్వుల నూనె దివ్యౌషధం.. స్క్రబ్‌గా పనిచేసే బియ్యం పిండి..

మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:04 IST)
శీతాకాలంలో ఆరోగ్య చిట్కాలతో పాటు సౌందర్య చిట్కాలు కూడా పాటించాల్సిందే. లేకుంటే చర్మం పొడిబారుతుంది. అందవిహీనంగా తయారవుతుంది. అందుకే శీతాకాలంలో వారానికి ఓసారి ఈ చిట్కాలు పాటించాలంటున్నారు.. బ్యూటీషన్లు. నువ్వులనూనె చలికాలంలో బాగా పనిచేస్తుంది. శరీరానికి ఈ నూనె పట్టించి సున్నిపిండితో రుద్ది, వేడి నీళ్ల స్నానం చేస్తే చర్మం సున్నితంగా మారుతుంది.
 
శీతాకాలంలో బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండిటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్‌ దొరికినట్టే. 
 
అలాగే ఒక టేబుల్‌ స్పూన ఉడికించిన ఓట్స్‌ని మెత్తగా చేసి రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్‌ స్పూన నిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతిమంతమవుతుంది. శెనగపిండి, పసుపు, పెరుగు ఈ మూడింటినీ కలిపి రాసుకుంటే చర్మంపై ఉండే టాన పోతుంది. పసుపు నల్లటి మచ్చల్ని పోగొడుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి