కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కారణం కావొచ్చు. శరీరంలో వచ్చే మార్పులకు మన చర్మం తొందరగా స్పందిస్తుంది. అలాంటి మార్పు వస్తే వెంటనే గమనించాలి.
చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నట్లైతే మానేసి తాజా కూరగాయలు, మాంసకృతులు ఉండే ఆహారం అధికంగా తీసుకుంటే మంచిది. కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వలన వీపును అలా కుర్చీకి ఆనించి ఉంచుతాం. ఇది కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు తప్పనిసరిగా విరామం ఉండేలా చూసుకోవాలి.
కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. తేనె కూడా దీనికి మంచి పరిష్కారం. తేనెను ఆ భాగంలో రాసుకుని అరగంట తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉండే సహజగుణాలు సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.