అరటిపండుని బాగా గుజ్జుగా చేసి అందులో కాస్త ఆలివ్ నూనె కలిపి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని చర్మానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మీ చర్మం నునుపుగా మారుతుంది. ఒట్స్, బాదం పప్పులను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఆ మిశ్రమంలో కొద్దిగా పెరుగూ, స్పూన్ తేనె కలిపి ముఖానికి మెడకు పూతలుగా వేసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. రెండు స్పూన్‌ల పాలలో కొద్దిగా బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె, ఆలివ్ నూనెను కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని చర్మానికి మర్దన చేసుకుని 30 నిమిషాల తరువాత కడుక్కుంటే పొడిబారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.