జుట్టు రాలడం అనే సమస్య చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో బట్టతల వస్తుందేమోననే కంగారుతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలకు మార్కెట్‌లో దొరుకుతున్న షాంపూలను, క్రీములను వాడుతుంటారు. ఇలాంటి వాటితో పనిలేకుండా ఇంట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చును.
కుంకుడు కాయలను నలగ్గొట్టి వాటిలోపలి గింజలను తీసేసి వేడి నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని పిండి రసం తీసి ఆ మిశ్రమంలో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. శీకాయలను మెత్తగా పిండిలా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కలబంద గుజ్జును జుట్టుకు రుద్దుకోవాలి. కాసేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. అలానే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉసిరికాయను పేస్ట్‌లా చేసుకుని అందులో రోజ్‌వాటర్‌ను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. దీంతో జుట్టుకు మంచి కాంతితో పాటు వాసన కూడా లభిస్తుంది.