కుంకుమ(సాఫ్రాన్) నూనె... ఉపయోగాలు ఏమిటో తెలుసా...?

గురువారం, 28 జులై 2016 (18:38 IST)
ఇండియన్ బ్యూటిలో బాగా పాపులర్ అయినది కుంకుమ పువ్వు. ఇది పురాతన కాలం నుండే బాగా వాడుకలో ఉన్నది. సాఫ్రాన్ ఆయిల్  ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నది. సఫ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు అందానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈజిప్ట్ యువతరానికి ప్రిన్సెస్ క్లియోపాత్ర కుంకుమపువ్వు నీళ్ళ‌లో స్నానం చేసేదట. దాంతో ఆమె అందమైన చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం పొందేవారట. అందువల్ల, ఈ కుంకుమపువ్వును  కొన్ని ఔషధాలలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.
 
* సప్రాన్ ఆయిల్‌తో జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలిసెల్స్‌ను మరియు హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. అందమైన జట్టును అందిస్తుంది.
*సఫ్రాన్ ఆయిల్ లేదా కుంకుమ పువ్వులో ఉండే బ్యూటి బెనిఫిట్స్ వ‌ల్ల చర్మంలో ఏర్పడ్డ గాయాలను, గాట్ల‌ను, చ‌ర్మ రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* సఫ్రాన్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్ మెంటల్ హెల్త్ నివారించడంలో చాలా బాగా సహాయపడతుంది. ఇది ఒత్తిడిని, మతిమరుపును త‌గ్గిస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యకు గురి చేయకుండా నివారిస్తుంది. 
* మహిళలు మెనుష్ట్రువల్ క్రాప్ మరియు మెనోపాజ్ ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడే వారికి సరైన ఫెర్టిలిటి పొందడానికి సఫ్రాన్ ఆయిల్ సహాయపడుతుది. ఇది శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తుంది. కాంప్లెక్స్ సెక్స్యువల్ హెల్త్ సమస్యలను నివారిస్తుంది.
*డయాబెటిస్ నివారించడంలో కుంకుమ‌పువ్వు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
* సఫ్రాన్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండ‌టం వ‌ల్ల హోం మేడ్ ఫేషియల్ ట్రీట్మెంట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మరియు ఎక్స్‌ఫ్లోయేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల మొటిమలను చాలా ఎఫెక్టివ్‌గా తొలగిస్తుంది.
*కుంకుమ పువ్వు నూనె ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దాంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది మరియు తిరిగి పూర్వస్థితికి చేరుకోవచ్చు. సఫ్రాన్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటిన్ లెవల్స్ పెరిగి ఆకలిని తగ్గిస్తుంది. లో సెరోటిన్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
* సఫ్రాన్ ఆయిల్‌ను ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు మరియు జలుబు వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి