ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించే పంచదార, నిమ్మరసం

బుధవారం, 26 జులై 2017 (12:22 IST)
ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించాలంటే.. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంపై హార్మోన్‌ల ఆధిపత్యం పెరగడంతో మొటిమలూ, అవాంఛిత రోమాలూ, కాలుష్యం కారణంగా పిగ్మెంటేషన్‌ వంటివన్నీ వస్తాయి. మన భారతీయ అమ్మాయిల్లో సహజంగా కనిపించే ఇనుము లోపంతో హెయిర్ ఫాల్‌కు కారణమవుతుంది. చక్కెర, నిమ్మరసం, నీటిని కలిపి పేస్టులా తయారు చేసుకుని.. ఆ మిశ్రమాన్ని రోమాలున్న చోట పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. 
 
నిమ్మ, చక్కెర కలిపిన మిశ్రమాన్ని నుదురు, బుగ్గలపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఇలా మాసానికి రెండు సార్లు లేదా మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా మొక్కజొన్న పొడి, ఒక చెంచా చక్కెరను గుడ్డులో కలిపి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకుని.. అవాంఛిత రోమాలు గల ప్రాంతంలో రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే రోమాలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి