శీతాకాలంలో చర్మ సంరక్షణ... ఈ చిట్కాలు పాటిస్తే...

శుక్రవారం, 4 జనవరి 2019 (20:11 IST)
సాధారణంగా చలికాలంలో చాలా మందికి చర్మం పొడిబారిపోతుంది. దీని నివారించడానికి రకరకాల క్రీములను వ్రాస్తుంటారు. దీని వలన అంతగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మన ఇంట్లో లభించే పదార్ధాలతోనే మనం మన చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 
1. టీ స్పూన్ ముల్తానీ మట్టి, టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.
 
2. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబైల్, మరియు హ్యుమెక్టా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి గొప్ప మాయిశ్చరైజ్‌గా పనిచేస్తుంది. దాంతో చర్మం సున్నితంగా మరియు స్మూత్‌గా మార్చుతుంది. తేనెలో విటమిన్స్ మరియు మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్నానం చేయడానికి ముందు మీ శరీరం మొత్తం తేనెను అప్లై చేసి పది నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత స్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
3. పెరుగు ఒక అద్భుతమైన స్కిన్ హైడ్రేటిగ్ ఏజెంట్. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి పొడి మరియు దురదపెట్టే చర్మాన్ని నివారిస్తుంది. పొడి చర్మం మరియు దురదకు గురిచేసే బ్యాక్టీరియా లేదా క్రిములను నాశనం చేసే ల్యాక్టిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.

తాజాగా ఉన్న పెరుగు తీసుకొని, ముఖం, చేతులు మరియు కాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 10 నిముషాలు అలాగే ఉంచి తర్వాత స్నానం చేసుకోవాలి. పెరుగులోని నాణ్యమైన గుణాలు డ్రై స్కిన్ తొలగిస్తుంది మరియు మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీన్ని ప్రతి రోజూ ఒక సారి చేస్తే సరిపోతుంది.
 
4. కలబంద చర్మంను సున్నితంగా మరియు నునుపుగా మార్చే మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని, దురదను నివారిస్తుంది. చర్మంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. కలబంద ఆకును కట్ చేసి తాజాగా ఉండే జెల్‌ను చర్మంపై రాసి 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు