సాధారణంగా స్త్రీలు అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనివలన అంతగా ప్రయోజనం ఉండదు. కనుక సహజంగా మనకు మన పెరట్లో దొరికే అనేక మెుక్కల ద్వారా మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
2. మనకు ప్రకృతిలో సహజంగా లభించే వేపలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ముఖ ఛాయను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వలన మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా చక్కటి మరియు ఆరోగ్యకర ముఖ ఛాయను అందిస్తుంది. అంతేకాదు వేప ఆకులు నీటిలో వేసి మరిగించి ఆ నీటితో వారానికొకసారి స్నానం చేయడం మంచిది. ఇది చర్మాన్ని చల్లగా మార్చుతుంది. మొటిమలను నివారిస్తుంది.
4. కొత్తిమీర డ్రై స్కిన్ నివారించండంలో బాగా సహాయపడుతుంది. గుప్పెడు కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె, మరియు నిమ్మరసం మిక్స్ చేసి డ్రై స్కిన్‌కు అప్లై చేయాలి. ఇలా వారంలో రెండుమూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.