కేశాలు రాలిపోతున్నాయా? అయితే నీళ్లు తాగండి.. షాంపూ, కండిషనర్ పనిచేయాలంటే?

బుధవారం, 10 ఆగస్టు 2016 (10:27 IST)
చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలి. నీళ్లు తగిన మోతాదులో తీసుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య ఉండదు.
 
ఏదైనా షాంపూ, లేదా కండిషనర్ జుట్టుపై సరిగ్గా పనిచేయాలంటే జుట్టులో తేమ శాతం సరిగ్గా ఉండాలి. శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు చర్మం ద్వారా బయటికి పంపించే పని కూడా నీరు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు రావు. అలసట వల్ల కళ్ళ చుట్టూ వచ్చే నలుపూ, మచ్చల వంటివి కూడా చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం వల్ల చాలావరకు మొటిమలు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి