బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవాలంటే.. ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.