శీతాకాలంలో రోజూ తలస్నానం చేయొద్దు..

గురువారం, 29 డిశెంబరు 2016 (11:46 IST)
శీతాకాలంలో వెంట్రుకలు పొడిబారిపోయి, చివర్లలో చిట్లిపోవడం, జుట్టు రాలిపోయే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తలస్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. అంతేకాదు హెయిర్ డ్రయ్యర్ వాడడం కూడా మంచిది కాదు. తప్పదనుకుంటే కోల్డ్ ఎయిర్ వాడటం మంచిది. శీతాకాలంలో రోజూ తలస్నానం చేయకూడదు. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా తలస్నానం చేయకూడదు.
 
ఇక చుండ్రు నివారణ కోసం మార్కెట్లో లభ్యమయ్యే యాంటి డాండ్రఫ్ షాంపూల్లో చాలావరకు జుట్టును పొడిబారేలా చేస్తాయి. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది. చుండ్రు బాధ ఎక్కువగా ఉంటే షాంపూలకు బదులుగా యాంటి డాండ్రఫ్ లోషన్లను వాడడం మేలు. వీటిని రాత్రంతా పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేయాలి. అయితే మాయిశ్చరైజింగ్ కండిషనర్ పెట్టుకోవడం మాత్రం మరవకూడదు. 

వెబ్దునియా పై చదవండి