కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం పార్లమెంట్‌లో ఈ ఏడాది సాధారణ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 50 ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీకి ఆమె బడ్జెట్‌లోనూ చోటుకల్పించారు. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులకు మెరుగైన ఆహార సరఫరా, రైల్వేస్టేషన్ల సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల, సరుకు రవాణా ఛార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. వాటిలో మార్పులేమీ చేయలేదు.
రైల్వేస్‌లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి ఆహ్వానం పలుకుతారనే ఊహాగానాలను మమతా బెనర్జీ తాజా బడ్జెట్‌లో నిజం చేశారు. పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) 50 ప్రపంచస్థాయి స్టేషన్లను నిర్మిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. సీఎస్‌టీ చెన్నై, పూణే, నాగ్‌పూర్, హౌరా, సీల్డా, న్యూఢిల్లీ, భువనేశ్వర్, వారణాసి, గౌహతి నగరాల్లో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.
వీటితోపాటు చెన్నై, త్రివేండ్రం సెంట్రల్, తిరుపతి, అహ్మదాబాద్, భోపాల్, ఆగ్రా, మథురా, చండీగఢ్, న్యూ జాల్పాల్‌గురి, మంగళూరు, కోచ్చిన్, పూరీ స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారు. ఇదిలా ఉంటే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారిస్తామని మమతా బెనర్జీ తాజా బడ్జెట్‌లో హామీ ఇచ్చారు.
ప్రయాణికుల సౌకర్యాల్లో భాగంగా రైల్వేస్టేషన్లలో క్రమశిక్షణ, భద్రత, మెరుగైన ఆహారం, నీరు, టాయ్‌లెట్ సౌకర్యాలు, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రాంతీయ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే లైన్లను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వేస్‌లో జనతా ఆహారం, నీరు అందేటట్లు చూస్తామన్నారు.
అలహాబాద్, ఆనంద్‌పూర్ సాహిబ్, బైకనీర్, బిలాస్‌పూర్, కటక్, డార్జిలింగ్, దుర్గాపూర్, ఎన్నాకులం, ఘాట్‌షిలా, హుజూర్ సాహిబ్, హైదరాబాద్, ఇండోర్, జబల్‌పూర్, ఝాన్సీ, ఖజురహో, మన్మద్, పాలక్కాడ్, రాజ్‌పూర్, రాజ్‌గీర్, షిర్డి, ఉజ్జయినీ, వడోదరా, విశాఖపట్నం తదితర 50 స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో మల్టీ ఫంక్షన్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామన్నారు. మత ప్రాధాన్యత ఉన్న 49 స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు.
మమతా రైల్వే బడ్జెట్ ఇతర ముఖ్యాంశాలు · ఇ- టిక్కెట్ల పంపిణీ సరళీకరణ · వెయిటింగ్ లిస్ట్ సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ చేయడం · ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ టాయ్లెట్లు · 50 మొబైల్ టిక్కెటింగ్ వ్యానులు · పోస్టాఫీసుల్లో కంప్యూటరైజ్డ్ టిక్కెట్ల విక్రయం · 140 స్టేషన్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు · కమాండో బెటాలియన్లు, మహిళా బెటాలియన్ల పెంపు · రైళ్లలో, స్టేషన్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత · వికలాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, ప్రత్యేక బోగీలు · రైల్వే ప్రయాణికులకు మెట్రో నగరాల్లో ఆంబులెన్స్ సేవలు · రాజధాని, శతాబ్ది రైళ్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సేవలు · 800 ప్రదేశాల్లో పీఆర్ఎస్, ఆరువందలకుపైగా టెర్నినళ్లు · 200 పెద్ద స్టేషన్‌లలో ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్ మిషిన్లు · ఇంటర్‌సిటీ రైళ్లలో ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు · ప్రతిజోను ఏడీజీఎం చేతుల్లో పర్యవేక్షణ బాధ్యతలు · దూర ప్రాంత రైళ్లలో ఒక వైద్యుడు · 140 సున్నితమైన రైల్వేస్టేషన్లలో సమగ్ర భద్రతా వ్యవస్థ · రైల్వే సిబ్బంది క్వార్టర్స్ అభవృద్ధి చేసేందుకు ట్రస్ట్ · అనేక డివిజన్లలో ఇండోర్ స్టేడియాలు · స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ రూ.350 కోట్లకు పెంపు · గ్రూపు డి ఉద్యోగుల పిల్లలకు స్కాలర్షిప్లు · ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, జబల్‌పూర్ నగారాల్లో నర్సింగ్ పాఠశాలలు · బిలాస్‌పూర్, నాగ్‌పూర్, భోపాల్, త్రివేండ్రం, హాజీపూర్, అహ్మదాబాద్ · రైల్వే ఉద్యోగుల పిల్లల్లో బాలికల కోసం స్కాలర్షిప్లు · అధిక సామర్థ్యం కలిగిన డబుల్ డెక్కర్ ఏసీ కోచ్‌లు · 200 కొత్త పట్టణాలకు రైల్వేస్ విస్తరణ · అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్ టెర్మినళ్ల సంఖ్యను 8000లకు పెంపు · రైళ్లలో వాక్యూమ్ టాయ్లెట్లు · సమిష్టివృద్ధికి రైల్వేస్ ఆదర్శం · రైల్వే ఆస్పత్రుల ఆధునికీకరణ · సమయపాలనకు కృషి · ఇ- టిక్కెటింగ్ విస్తరణ, సరళీకరణ · ఉష్టోగ్రత నియంత్రణలో ఉండే కార్గో కేంద్రాల ఏర్పాటు · ఈస్ట్రన్, వెస్ట్రన్ కారిడార్లలో మెగా లాజిస్టిక్స్ హబ్‌లు · ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీయే లక్ష్యం · రైల్వే భూముల్లో పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో కళాశాలలు · 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు · రైల్వే రిక్యూట్‌మెంట్ విధానంపై సమీక్ష · అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త రైల్వే కోచ్ ప్యాక్టరీ · టాలీగుంజ్‌లో మెట్రో రైలు ఆస్పత్రి ఆధునికీకరణ · 375 స్టేషన్లలో 309 స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి · ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ వినియోగం పెంపు · ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల కొత్త వ్యాగన్లు · వర్క్‌షాప్ సామర్థ్యం పెంపుకు ప్రణాళికలు · రైల్వే ప్రింటింగ్ ప్రాసెస్ స్థాయి పెంపు · కంటైనర్ల ప్రైవేట్ సైడింగ్స్‌కు ఆమోదం · పరిశీలనలో మెగా లాజిస్టిక్స్ హబ్‌ల ప్రతిపాదన · కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటు · ప్రీమియం సరుకు రవాణా సేవలు · తుగ్లాకాబాద్- చెన్నై, తుగ్లకాబాద్- హౌరా, తుగ్లకాబాద్- ముంబయి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (సరుకు రవాణాకు ప్రత్యేక రైల్వే లైన్లు) · ఈస్ట్రన్ కారిడార్‌ను డాన్‌కునీ వరకు పొడిగింపు · సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణపై దృష్టి · రిక్ర్యూట్‌మెంట్‌లో జాతీయ క్రీడాకారులకు ప్రాధాన్యత · రైల్ ఆఫ్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటు · 10 ఆర్థిక సంవత్సరంలో 18వేల వ్యాగన్ల సేకరణ · బర్న్ స్టాండర్డ్స్ బ్రిటీష్‌వైట్ యూనిట్ల కొనుగోలు త్వరలో పూర్తి · ప్రెస్ కరస్‌పాండెట్స్‌కు, వారి జీవిత భాగస్వాములకు 50 శాతం డిస్కౌంట్ · డిస్కౌంట్ పథకాల్లో హై మదర్సా, సీనియర్ మదర్సా విద్యార్థులకు ప్రవేశం · అసంఘటిత రంగ ఉద్యోగులకు (నెలకు రూ.1500కన్నా తక్కువ జీతం కలవారు) రూ.25కే నెలవారీ టిక్కెట్ · సరుకు రవాణా టెర్నినళ్లలో ప్రైవేట్ కార్యకలాపాలకు ప్రోత్సాహం · యువ ట్రైన్: ఏసీ సీటు ఛార్జీ రూ.299 (100 కిలోమీటర్లులోపు ప్రయాణం), రూ.399 ఛార్జీతో 1500 కిలోమీటర్లకుపైగా ప్రయాణం · పశ్చిమబెంగాల్‌లోని కచరాపారాలో కొత్త కోచ్ ప్యాక్టరీ · కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై నగరాల్లో ప్రత్యేక మహిళా రైళ్లు · నాన్‌స్టాప్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్, ప్రధాన స్టేషన్ల మధ్య వీటిని నడుపుతారు. 12 కొత్త ఏసీ స్లీపర్ నాన్‌స్టాప్ రైళ్లకు రంగం సిద్ధం · ఢిల్లీ- లక్నో, కోల్‌కతా- ముంబయి, ఢిల్లీ- చెన్నై, ముంబయి- అహ్మదాబాద్, ఢిల్లీ- అలహాబాద్, ఢిల్లీ- జమ్ముతావి, ఢిల్లీ- సీల్దా, ఢిల్లీ- భువనేశ్వర్, ఢిల్లీ- ఎన్నాకులం స్టేషన్ల మధ్య నాన్- స్టాప్ రైళ్లు · 57 కొత్త రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ · విశాఖపట్నం- ముంబయి, బిలాస్‌పూర్- హైదరాబాద్ కొత్త రైళ్లు · బడ్జెటరీ వ్యయం రూ.5000 కోట్లకు పెంపు · 2009-10లో సరుకు రవాణా లక్ష్యం 882 మిలియన్ టన్నులు · ఐఆర్ఎఫ్‌సీ నుంచి ట్రాక్స్ ఫ్రీ బాండ్లు · కోల్‌కతా మెట్రో విస్తరణ · 2008/09లో సరుకు రవాణాలో ఐదు శాతం వృద్ధి