రూ.10 లక్షల కోట్లు దాటిన ప్రణబ్ బడ్జెట్‌

దేశ సాధారణ బడ్జెట్ తొలిసారి రూ.10లక్షల కోట్లు దాటి రికార్డు సృష్టించింది. మొత్తం బడ్జెట్‌ వ్యయం ఈసారి రూ.10,20,838 కోట్లు. ఈ బడ్జెట్‌లో రాయితీలకు, రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్‌లో సబ్సిడీల భారమే రూ. లక్ష కోట్లు ఉంది. ఇదిలా ఉంటే ప్రణాళిక వ్యయం రూ.3,25,149 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.6,95,690 కోట్ల వద్ద ఉంది.

బడ్జెట్‌ వ్యయం 36 శాతం పెరిగింది. ఇదిలో ప్రభుత్వం వివిధ పథకాలకు, రంగాలకు కల్పిస్తున్న సబ్సిడీ విలువ రూ.1,11,236 కోట్లు. రక్షణ రంగానికి జరిగిన కేటాయింపుల విలువ రూ.1,41,700 కోట్లు. అంతేకాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపును భారీగా పెంచారు. ఫ్రింజ్ బెనిఫిట్ పన్నును రద్దు చేయగా, కార్పొరేట్ పన్నును యథాతథంగా ఉంచారు.

వెబ్దునియా పై చదవండి