ధరల నియంత్రణపై చర్చించేందుకు సీఎంలతో ప్రధాని భేటీ

గురువారం, 8 ఏప్రియల్ 2010 (17:19 IST)
భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు గురువారం ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు.

పాలు, పండ్లు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో 27 మార్చితో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.70 శాతానికి చేరుకుంది. అదే అంతకుమునుపు వారాంతంలో ఆహార ద్రవ్యోల్బణం 16.35 శాతంగా ఉండింది.

ఫిబ్రవరి మాసాంతపు ఆహార ద్రవ్యోల్బణం 9.89 శాతంగా ఉండింది. అదే వార్షిక ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే పప్పు దినుసుల ధరలు 32.60 శాతం, పాల ధరలు 21.12 శాతం, పండ్ల ధరలు 14.95 శాతం, గోధుమల ధరలు 13.34 శాతం మేరకు పెరిగాయి, ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేస్, అస్సోం, బీహార్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో ఓ సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో దేశంలో పెరుగుతున్న ధరలను అదుపుచేయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కమిటీగా ఏర్పడ్డారు. వీరి పని సమయానుసారం దేశంలో పెరిగే ధరలను అదుపు చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించి సూచనలు సలహాలు ఇవ్వవలసివుంటుంది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన ధరల నియంత్రణ కమిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణభ్, వ్యవసాయ శాఖామంత్రి శరద్‌పవార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాలుంటారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో భారతీయ రిజర్వు బ్యాంకు స్వల్పకాలిక రుణాల్లో మార్పులు చేసింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపది విధానంపై చర్చించేందుకు మళ్ళీ ఈ నెల 20న సమావేశం కానుంది.

వెబ్దునియా పై చదవండి