ఉద్యోగ నియామకాలపై భారత్ కంపెనీల దృష్టి!

వచ్చే మూడు నెలల్లో భారత కంపెనీలు తమ అవసరాల నిమిత్తం భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనున్నాయి. కొత్త ఉద్యోగాల నియామకంపై ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీ తాజాగా
అధ్యయనం నిర్వహించింది. ఇందులో భారత కంపెనీల్లో 46 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నాయి.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. కంపెనీలు నియామకాలపై మొగ్గు చూపడం గమనార్హం. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల కోసం పెరుగుతున్న గిరాకీ దేశ వ్యాప్తంగా కంపెనీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

అయినా, దాదాపు అన్ని రంగాల్లో నియామకాల సెంటిమెంట్‌ 2011 ఏడాది మూడో త్రైమాసికానికి (జులై-సెప్టెంబరు) ఆశావహంగానే ఉందని మ్యాన్‌పవర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ పండిట్‌ తెలిపారు.

ఈ ఉద్యోగ అవకాశాల ప్రభావం భారత్‌తో సహా బ్రెజిల్‌, తైవాన్‌, టర్కీ, సింగపూర్‌లలో ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో మాత్రం ఈ అవకాశాలు తక్కువగా ఉందని సంజయ్ పండిట్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి