గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 62వ స్థానంలో భారత్

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)లో భారత్ స్థానం మరింతగా దిగజారింది. గత యేడాది 52వ ర్యాంకులో ఉండగా, తాజాగా వెల్లడించిన అధ్యయనం ప్రకారం భారత్ 62వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. స్వీడన్, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఫిన్‌లాండ్ దేశాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

శరవేగంగా ఆర్థికాభివృద్ధిని నమోదు చేసుకుంటున్న చైనా టాప్ -30లోకి వచ్చింది. జీఐఐలో ప్రస్తుతం చైనా ర్యాంకు 29గా నమోదైంది. భారత పరిశ్రమల సమాఖ్యం (సీఐఐ), ఐఎన్‌ఎస్‌ఈఏడీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేను జెనీవాలో విడుదల చేశారు.

దీనిపై సీఐఐ ఇన్నోవేషన్ కౌన్సిల్ 2011-12 ఛైర్మన్, ఫోర్బ్స్ మార్షల్ డైరక్టర్ డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ మాట్లాడుతూ... ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ సర్వేను నిర్వహించినట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి