వృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అధిక ద్రవ్యోల్బణం: డీ సుబ్బారావు

మంగళవారం, 27 సెప్టెంబరు 2011 (10:30 IST)
సుమారు తొమ్మిది శాతం నమోదవుతున్న ద్రవ్యోల్బణం భారత ఆర్థికవృద్ధికి ఆటంకం కలిగిస్తున్నదని పేర్కొన్న భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ద్రవ్యోల్బణ అదుపుకు చేపట్టిన తాజా ద్రవ్య కఠినత్వాన్ని మాత్రం సమర్ధించుకున్నారు.

తక్కువ ద్రవ్యోల్బణం వృద్ధిని ప్రోత్సహించడంలో దోహదపడుతుంది, ధరల ఒత్తిడిలో వేగంగా వృద్ధి చెందాలంటే ద్రవ్యవిధాన కఠినత్వం అవసరమని దువ్వూరి సుబ్బారావు న్యూయార్క్‌ యూనివర్శిటీలో చేసిన ప్రసంగంలో తెలిపారు.

"ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా ఉంటే, బహుశా కొంతమేర అధిక ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలమనే వాదన ఉండేది, అయితే ద్రవ్యోల్బణం సుమారు 9 శాతం నమోదవుతున్నది" అని చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్ ద్రవ్యోల్బణం, వృద్ధికి ఆటంకం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి