2025 యెజ్‌డీ రోడ్ స్టర్ బార్న్ ఔట్ ఆఫ్ లైన్

ఐవీఆర్

బుధవారం, 13 ఆగస్టు 2025 (23:17 IST)
ముంబయి: జావా యెజ్ డీ మోటర్ సైకిల్స్ ప్రకటించింది యెజ్ డీ రోడ్ స్టర్ 2025. ఇది బ్రాండ్ యెజ్ డీలో తాజా చేర్పు. ఇది, ఈ క్లాసిక్ సెగ్మెంటులో, నిజమైన ఇండియన్ ఛాలెంజర్. అంతేకాక బార్న్ ఔట్ ఆఫ్ లైన్ కావటం గర్వకారణం. దీని ధర రూ. 2.09 లక్షల నుండి ప్రారంభం. విప్లవాత్మకమైన డిజైన్‌తో, శక్తివంతమైన పనితీరుతో, 50కి పైగా కాంబినేషన్ ఆప్షన్లు ఉన్న ఆరు ఫ్యాక్టరీ-బ్యాక్‌డ్ కస్టమ్ కాంబినేషన్లతో, యెజ్ డీ రోడ్ స్టర్, పరిమితులను సృష్టించే సంప్రదాయాలను సవాలు చేస్తూ, వ్యక్తిత్వంపై పరిఢవిల్లుతుంది.    
 
ఆకర్షణీయమైన రూపురేఖలతో, ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పైన వెనుక టైర్లతో మనసును ఆకట్టుకునే విధంగా దీని "బార్న్ ఔట్ ఆఫ్ లైన్" డిజైన్, సాధారణంగా ఊహించేదానికి భిన్నంగా ఒక వినూత్నమైన డిజైన్‌ను ప్రతిబింబిస్తూ ఒక వినూత్నమైన మెషీన్‌ను సృష్టిస్తుంది. దీని ఐకానిక్ ట్విన్-బ్యారెల్ ఎగ్జాస్ట్‌లు మీరు తప్పకుండా గుర్తించే యెజ్ డీ పాప్స్, బ్యాంగ్స్‌ను అందిస్తాయి. దీనిలోని చాప్డ్ రియర్ ఫెండర్, ఇంకా బోల్ట్ ‘69’ డీకాల్స్, ప్యూర్ మోటార్ సైక్లింగ్‌లో బ్రాండ్‌కు ఉన్న ఘనమైన చరిత్రకు నివాళులర్పిస్తాయి. 
 
రైడర్లు తమ స్టైల్‌కు అనుగుణంగా తమ వాహనాన్ని మార్చుకునేందుకు వీలుకలిగించగల 6కు పైగా ఫ్యాక్టరీ కస్టమ్ కాంబినేషన్లు, ఇంకా 20కి పైగా ప్లగ్-అండ్-ప్లే యాక్సెసరీలతో, ఈ విభాగంలో రోడ్ స్టర్ విప్లవాన్ని తీసుకువచ్చింది. మాడ్యులర్ సీటింగ్ ఆప్షన్లు మొదలుకుని కస్టమైజబుల్ హ్యాండిల్ బార్లు, వైజర్లు, క్రాష్ గార్డుల వరకు, రోడ్ స్టర్ కేవలం మీకు మాత్రమే స్వంతమయ్యే విధంగా రూపొందించబడింది. మినిమలిస్ట్ స్కౌట్-స్టైల్ కలిగిన ట్రాకర్ సోలో సీట్ నుండి టూరింగ్‌కు అనుకూలమైన డ్యూయల్ సెటప్‌కు రైడర్లు సునాయాసంగా నిముషాల్లో మారగలుగుతారు. ఈ వినూత్నమైన ఇనొవేషన్, స్టైల్‌ను ఆచరణాత్మకతతో రంగరిస్తుంది. ట్యాంకు పైన, సింగిల్ సీట్‌కు వెనుక వైపున ఫరవహర్ ఇన్ సిగ్నియా వంటి ప్రీమియమ్ టచ్‌లతో, డిజైన్‌కు అథెంటిసిటీని, లగ్జరీని చేర్చుతూ యెజ్ డీ యొక్క పార్సీ హెరిటేజ్‌ను పొంది ఆనందించండి.
 
యెజ్ డీ రోడ్ స్టర్, ఊల్వ్‌స్ దుస్తుల్లో ఉన్న ఊల్ఫ్. భారతదేశపు రోడ్ల మీద, గుండెల్లోనూ గర్జిస్తూ ముందుకు సాగే యెజ్ డీ తీపిజ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేదు. కూల్ డాడ్‌లు, వారి ముద్దుల బిడ్డలు, అసలైన రోడ్ల మీద, ఒక నిజమైన బైక్ పైన తిరిగి వాస్తవమైన కథలను సృష్టించుకున్నారు. వారి తొలి జాబ్, మొదటి ఫాల్, మొదటి ప్రేమ, అన్నీ యెజ్ డీ పైనే. యెజ్ డీ ఒక జీవనమార్గం, ఒక యాటిట్యూడ్, ఒక ఆలోచన. మొదలైనప్పటి నుండి ఇది మోనోపలిస్టిక్ మార్కెట్లో ఛాలెంజర్‌గా జన్మించింది. తమ స్వంత మార్గాన్ని ఎంచుకోదలిచిన రెబల్స్, యెజ్ డీని తమ సాంస్కృతిక యాంబ్లమ్‌గా మార్చుకున్నారు, అని అనుపమ్ థరేజా, జావా యెజ్ డీ మోటార్ సైకిల్స్ కో-ఫౌండర్ అన్నారు. కొత్త తరం వైల్డ్ కార్డులందరికీ ఈ కొత్త రోడ్ స్టర్ బార్న్ ఔట్ ఆఫ్ లైన్, ఊల్ఫ్ పిలుపుగా మారనున్నది. దీని విప్లవాత్మకమైన డిజైన్, అధునాతనమైన పనితీరు, టూరింగ్-రెడీ ఇంజనీరింగ్ లతో యెజ్ డీ రోడ్ స్టర్, తమకంటూ స్వంత మార్గాన్ని నిర్మించుకునేవారి కోసం రారమ్మని పిలుపునిస్తోంది, మీ ట్రైబ్ పిలుస్తోంది.
 
రోడ్ స్టర్ గుండెల్లో, 29PS మరియు 30Nmలను డెలివర్ చేసేందుకు వీలుగా ట్యూన్ చేసిన సరికొత్త 350 ఆల్ఫా2 లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉన్నది. ఇది ఉత్తేజాన్నిచ్చే స్మూత్ రైడ్‌ను అందిస్తుంది. ఈ సెగ్మెంటులో మొట్టమొదటి 6-స్పీడ్ గేర్ బాక్స్ మరియు అసిస్ట్-స్లిప్పర్ క్లచ్‌లు సునాయాసమైన గేర్ షిఫ్టులకు అనువును కల్పిస్తాయి. అది మీరు పట్టణం వీధుల్లో తిరుగుతున్నా లేక హైవేల పై దూసుకువెడుతున్నా సరే.  
 
టూరింగ్ కోసం డిజైన్ చేయబడిన రోడ్ స్టర్ ఆఫర్ చేస్తోంది ఒక 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్. దీని రేంజ్ 350 కిమీలకు పైగా ఉంటుంది. దీనితో మీరు సునాయాసంగా సుదూరప్రయాణాలు చేయగలుగుతారు. దీనిలోని సెంటర్-ఫార్వార్డ్ ఫుట్ పెగ్‌లు, హాయిగా ఉండే రైడింగ్ త్రిభుజాన్ని ఇస్తాయి. అందువల్ల, స్పోర్టీ హ్యాండ్లింగ్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండానే, ఎక్కువ గంటల పాటు కూర్చుని వాహనం నడపగలుగుతారు. రోడ్ స్టర్‌లో అన్ని అంశాలు, అపరిమితమైన శక్తి, సౌకర్యం, కంట్రోల్‌లను కలిపి అందించే విధంగా ఇంజనీర్ చేయబడినవి.
 
ఈ విభాగంలో బ్రేకింగ్, హ్యాండ్లింగ్ విషయంలో రోడ్‌స్టర్ ఒక బెంచ్ మార్కును ఏర్పాటు చేసింది. కాంటినెంటల్ నుండి బెస్ట్-ఇన్-క్లాస్ డ్యూయల్ ఛానెల్ ABS కలిగిన రోడ్ స్టర్ లో 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, 240 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి ఖచ్ఛితమైన స్టాపింగ్ పవర్‌ను అందజేస్తాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ రియర్ షాక్ లు స్థిరత్వాన్ని, సౌకర్యాన్ని అందిస్తాయి. కాగా, దీనిలోని 795 ఎంఎం సీట్ ఎత్తు, ఆప్టిమైజ్ చేసిన గ్రౌండ్ క్లియరెన్స్, యాక్సెసబిలిటీకి, నియంత్రణలో ఉండే రోడ్ ప్రెజెన్స్‌కు మధ్య చక్కని సమన్వయాన్ని సాధించిపెడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు