2026 లో ఆపిల్ ఎలక్ట్రిక్ కారు: ధర ఎంతో తెలుసా?

బుధవారం, 14 డిశెంబరు 2022 (11:45 IST)
ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఆపిల్ తన మొదటి ఎలక్ట్రిక్ కారును 2026 లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.  గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ కార్లకు భారతదేశంతో పాటు విదేశాలలో అధిక డిమాండ్ ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆపిల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఈ కారు విలువ రూ.80 లక్షలకు పైగా ఉంటుంది. ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంటే ఈ కారు మరింత అధునాతన సాంకేతిక విలువలను కలిగి ఉంటుందని కూడా నివేదించబడింది. 
 
ఆపిల్ తమ ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ ప్రాజెక్టును 2024 లో లేదా 2028 నాటికి ప్రారంభించనున్నట్లు ఇప్పటివరకు పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టును ఆపిల్ 2026లో విడుదల చేస్తుందని సూచిస్తున్నాయి. ఈ కారు పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ తో ఫీచర్ తో పనిచేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు