సామాన్యులపై గుదిబండ.. మళ్లీ పెరగనున్న సిలిండర్ ధరలు

శనివారం, 7 మే 2022 (10:45 IST)
సామాన్యులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇది షాకిచ్చే న్యూస్. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. 
 
ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.200 పైగా పెరిగింది. తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచేశాయి చమురు కంపెనీలు. 
 
తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 1052 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. 
 
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎల్‌పీసీ సిలిండర్ ధరలు పెంచడం సామాన్యులపై మరో భారం మోపినట్లయింది. 
 
చివరిసారిగా, ఈ ఏడాది మార్చి 22న ఆయిల్ కంపెనీలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి ధరలను పెంచాయి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు