భారత్ పాకిస్థాన్ యుద్ధ సమయంలో టర్కీ దేశం పాకిస్థాన్‌కు ఆయుధ సహాయం చేసింది. టర్కీ చేసిన బహిరంగ మద్దతు పలకడం దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 'బ్యాన్ టర్కీ' ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రంలోని పూణె నగరంలోని దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా అక్కడి వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ను బహిష్కరించారు.
పూణెలోని పండ్ల వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్‌ను విక్రయించకూడని నిర్ణయించారు. దీంతో స్థానిక మార్కెట్‌లలో టర్కిష్ యాపిల్స్ దాదాపుగా కనుమరుగయ్యాయి. కేవలం వ్యాపారులే కాకుండా, సాధారణ పౌరులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై, టర్కీ యాపిల్స్‌కు బదులుగా ఇతర దేశాల నుంచి వస్తున్న లేదా స్వదేశీ పండ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ బహిష్కరణకు పూణె పండ్ల మార్కెట్‌పై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా టర్కిష్ యాపిల్స్ ద్వారా సీజన్‌లో సుమారు రూ.1000 కోట్ల నుంచి రూ.12000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని ఇపుడది దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, దేశ సాయుధ బలగాలకు ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటించే చర్య అని వ్యాపారులు చెబుతున్నారు.