ఆగస్టు నెలలో బ్యాంకు ఖాతాదారాలు అప్రమత్తంగా ఉండాలి. శని, ఆదివారాలతో పాటు.. పలు పబ్లిక్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకులు మూసివేస్తారు. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులు పని చేసే రోజులను తెలుసుకుని తమ పనుల కోసం బ్యాంకులకు వెళ్ళాలి.
ఆగస్టు నెల నుంచి దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది. ఇందులోభాగంగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినియకచవితి వంటి అనేక పండగలు ఉన్నాయి. దీంతో బ్యాంకులకు సెలవులు భారీగానే రానున్నాయి. ఈ క్రమంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. ఆ ప్రకారంగానే బ్యాంకులు పని చేయనున్నాయి.
ఆర్బీఐ వీడుదల చేసిన జాబితా ప్రకారం..
ఆగస్టు ఒకటో తేదీన సిక్కిం రాష్ట్రంలని గ్యాంగ్‌కట్‌లో అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి.
ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సర వేడుకలు
ఆగస్టు 18న శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్టు 19న శ్రావణ వద్ లేదా కృష్ణ జయంతి