రంగు మారే కారును చూశారా? బటన్ నొక్కితే చాలు రంగు అలా మారిపోతుంది..
శుక్రవారం, 7 జనవరి 2022 (14:43 IST)
Colour Changing car
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ రంగులు మారే కారును రూపొందించింది. ఒక్క బటన్ నొక్కితే కారు రంగు మారిపోవడం ఈ కారు ప్రత్యేకత. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో పేరుతో రూపొందించిన ఈ వినూత్న ఎలక్ట్రిక్ కారును లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్-2022)లో ఆవిష్కరించింది.
ఈ ఈవెంట్‌లో శామ్‌సంగ్, సోని, బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులు కనిపించాయి. సామ్‌సంగ్ 180-డిగ్రీ రొటేటింగ్ ప్రొజెక్టర్‌ను ప్రవేశపెట్టగా, బీఎండబ్ల్యూ ఐఎక్స్ అనే ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది బటన్‌ను నొక్కినప్పుడు దాని రంగును మారుస్తుంది.
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో కారును ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ-ఇంక్ కంపెనీ సహకారంతో ఈ టెక్నాలజీని కారులో వినియోగించారు. ఈ కారు బటన్ నొక్కగానే రంగు మారుతుంది. ఈ కారు పూర్తి ఫీచర్ల గురించి బీఎండబ్ల్యూ సంస్థ ఇంకా వెల్లడించలేదు.
అయితే ఈ మోడల్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ట్విట్టర్ యూజర్ ఔట్ ఆఫ్ స్పెక్ స్టూడియోస్ అప్‌లోడ్ చేసిన వీడియోలో కారు రంగులు మారుతున్నట్లు కనిపించింది.