5జీ సేవల్లో బీఎస్ఎన్ఎల్ కూడా.. 200 పట్టణాల్లో అందిస్తాం.. : మంత్రి అశ్విన్ వైష్ణవ్

ఆదివారం, 2 అక్టోబరు 2022 (14:58 IST)
దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా 5జీ సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చే 2023 నాటికి దేశంలో ఎంపిక చేసిన 200 పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆయన తెలిపారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సైతం 5జీ రేసులోకి అడుగుపెట్టనుందని ఖాయమైపోయింది. 
 
కాగా, అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన 5జీ ప్లాన్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరింత చౌకగా అందిస్తుందించే ప్రయత్నం చేయాలని మొబైల్ వినియోగదారులు కోరుతున్నారు. 
 
వచ్చే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 80-90 ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అశ్వని వైష్ణవ్ చెప్పారు. 5జీ సేవలు కూడా అందుబాటు ధరల్లోనే ఉండాలన్నారు. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. 
 
ఈ తరుణంలో ఈ రెండింటి నుంచి ముందుగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంతవరకు 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో 5జీ సేవలపై మంత్రి ప్రకటన చేయడం గమనించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు